పీరియడ్స్ సక్రమంగా రాకుంటే ఇలా చేయండి

     పీరియడ్స్ సక్రమంగా రాకుంటే ఇలా చేయండి

పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం కూడా ఒక అనారోగ్య సమస్యేనని వైద్య నిపుణులు చెప్తున్నారు . ఇది మహిళల పట్ల తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది . హార్మోన్ల అసమతుల్యత , అధిక బరువు , మారుతున్న జీవన శైలి , ఆహారపు అలవాట్లు ఇలాంటి కారణాల వల్ల మహిళలలో రుతుక్రమం సరిగా రావడం లేదు . అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే పలు చిట్కాలున్నాయి . మనకు సహాజంగా దొరికే ఆహార పదార్థాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు . విటమిన్ సి పండ్లు రుతుక్రమం సక్రమంగా రావడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది . విటమిన్ - సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు . బొప్పాయి కెరోటిన్ కలిగిన పండు . ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ను ప్రేరేపిస్తుంది . పైనాపిల్ లో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది . ఇది మంట తగ్గించడానికి సహాయపడుతుంది . మీకు రుతు క్రమ సమస్యలు వేధించినట్లైతే నిమ్మకాయలు , కివీ పండ్లు , నారింజ తినడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు .

పసుపు : పసుపు గర్భాశయంలో రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది . శరీరంపై యాంటిస్పాస్మోడిక్ ప్రభావం కలిగి ఉంటుంది . ఇది గర్భాశయాన్ని విస్తరించడానికి రుతుక్రమం సరైన సమయానికి రావడానికి ప్రేరేపించడంలో కీలకంగా పని చేస్తుంది . పసుపు పాలను తాగడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా వస్తాయి . బెల్లం బెల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా .. క్రమరహిత పీరియడ్స్ సమస్యను అధిగమించొచ్చు . బీట్రూట్ : బీట్ రూట్లో ఇనుము , కాల్షియం , ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటాయి . ఇది కడుపులో మంట తగ్గించడానికి చాలా సహాయపడుతుంది . అలం : మీ ఆహారంలో అల్లం జోడించడం వల్ల మెనోపాజ్ సమస్యను నివారించవచ్చు . పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడానికి చెంచాడు అల్లాన్ని తేనేతో కలిపి తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది .

Post a Comment

0 Comments