రేపట్నుంచి ప్రారంభం JEE Mains Exams
  • నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి .. గడువు ముగిశాక అనుమతించరు
  • కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి
  • రాష్ట్రంలో 19 సెంటర్లు .. 45 వేల మంది విద్యార్థులు

    

          ఐఐటీ , ఎన్జీటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవే శాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( జేఈఈ ) మెయిన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి . కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ సెప్టెంబర్ 6 వరకు పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ( ఎన్టీఏ ) అన్ని ఏర్పాట్లు చేసింది . జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుండి 6608 పెంచారు . ఇప్పటికే అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షల సమయంలో అను సరించాల్సిన విధివిధానాలపై సూచనలు జారీ చేశారు . దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరు కానుండగా రాష్ట్రం నుంచి 45 వేల మంది వరకు పరీక్షలు రాయనున్నారు .

 అభ్యర్థులకు సూచనలివీ .. 

• కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి . గడువు సమయం ముగిశాక ఎవరినీ అనుమ తించరు . పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు . 

• పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ఎసీఏ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసి న అడ్మిట్ కార్డులోని కోవిడ్ -19 సెల్ఫ్ డిక్లరేషన్ ( అండర్ టేకింగ్ ) లో వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి . దానిపై ఫొటో 
  • అంటించు ఎడమచేతి బొటనవేలి ముద్ర కూడా వేయాలి . అందులో గత 14 రోజులుగా తనకు జ్వరం , దగ్గు , గొంతు సమస్యలు , శ్వాస సమస్యలు , శరీర నొప్పులు లేవని పేర్కొనాల్సి ఉంటుంది ఆధార్ లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకో వాలి . 
  • సెల్‌ఫోన్లో స్కాన్ చేసిన గుర్తింపు కార్డులు చెల్లుబాటు కావు . అదనపు ఫొటో కూడా తేవాలి . రఫ్ వర్కు కోసం ప్రతి సీటు వద్ద ఏ -4 సైజ్ తెల్ల కాగితాలు 5 ఉంటాయి . 
  • బయటకు వెళ్లేముందు వర్కు షీట్లు , అడ్మిట్ కార్డు డ్రాప్ బాక్సులో వేయా లి . లేదంటే జవాబుల మూల్యాంకనం జరగదు . 
  • పరీక్ష కేంద్రాల్లో ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు శుభ్రం చేయడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు .
  •   పరీక్ష కేంద్రాలివే : అనంతపురం , భీమవరం , చీరా ల , చిత్తూరు , ఏలూరు , గుంటూరు , కడప , కాకినాడ , కర్నూలు , నెల్లూరు , ఒంగోలు , రాజమహేంద్రవరం , శ్రీకాకుళం , తిరుపతి , విజయవాడ , విశాఖపట్నం , విజయనగరం , నరసరావుపేట , సూరంపాలెం . .