Ticker

6/recent/ticker-posts

బాబోయ్ దయ్యం

బాబోయ్ దయ్యం 

           నరేంద్ర వ్రాసే కథావస్తువు చదవరులుని భయం పుట్టించేవి . అటువంటి భయంకర కథలు రాయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు . ఉన్నట్టుండి తను నివసించే చోట దెయ్యం తిరుగుతుందన్న పుకారు పుట్టి అందరూ చీకటి పడకముందే తలుపులు బిగించుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండేవారు . ఆ దినం అమావాస్య . కరెంటు పోయింది . చిన్న చిన్న చినుకులు ప్రారంభం అయ్యావి . ఉన్నట్టుండి నరేంద్ర ఇంటి రేకు తలుపు ఎవరో ఆడించిన శబ్దం . టార్చిలైటు వెలిగించి చూసాడు . తలుపు కదులుతూ శబ్దం . ' ఎవరు ' . ధైర్యంతో గట్టిగా అన్నాడు . జవాబు రాలేదు . గుండె కొట్టుకుంది . చెమట పట్టినట్లయ్యింది . ధైర్యంతో మేడ మెట్లు ఎక్కి కిందకు లైటు వేసాడు . తన తలుపు దగ్గర ఓ కుక్క ముడుచుకొని వర్షం చినుకులకు కదులుతూ దులుపుకుంటుంది . అది అలా చేస్తున్నప్పుడల్లా రేకుల తలుపు శబ్దం అవుతుంది . ' బాబోయ్ దయ్యం అనుకున్నాను ' అనుకొని గది చేరాడు .
Reactions

Post a Comment

0 Comments