Ticker

6/recent/ticker-posts

కారు నెంబర్ ‘కోవిడ్-19’.. ఫిబ్రవరిలో పార్కింగ్.. ఎందుకు పార్క్ చేశారు? ఎవరు పార్క్ చేశారు?

కారు నెంబర్ ‘కోవిడ్-19’.. ఫిబ్రవరిలో పార్కింగ్.. ఎందుకు పార్క్ చేశారు? ఎవరు పార్క్ చేశారు?

ఆ బీఎండబ్ల్యూ కారు ఐసోలేషన్‌లో ఉందా? దానిపై ‘కోవిడ్-19’ అనే నెంబరు ఎలా ఉంది? ఫిబ్రవరి నుంచి దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఎందుకని?


కరోనా పేరు వింటేనే అంతా హడలిపోతున్నారు. అలాంటిది.. ఓ విమానాశ్రయం పార్కింగ్‌లో గత కొన్ని నెలలుగా ఉంటున్న ఓ బీఎండబ్ల్యూ కారు నెంబరు ప్లేటుపై ‘కోవిడ్-19’ అని రాసి ఉండి . 

నిత్యం రక్షణ కవచంలో ఉండే విమానాశ్రయంలోకి ఈ కారు ఎలా వచ్చింది? 

అసలు ఎలా వచింది.ఎవరు పార్కు చేశారు? 

దీని యజమాని ఎక్కడికి వెళ్లాడు? 

ఇలా ఎన్నో సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ విమానాశ్రయంలో పార్కు చేసిన ఈ కారు ఇప్పుడు భద్రతా అధికారుల నిఘాలో ఉంది. బూడిద రంగులో ఉన్న ఈ కారును సుమారు ఫిబ్రవరి నెలలో పార్కు చేశారని విమానాశ్రయ పార్కింగ్ సిబ్బంది ఒకరు తెలిపారు. అయితే, కరోనా వైరస్‌కు ‘కోవిడ్-19’ అని పేరు పెట్టిందే ఫిబ్రవరి నెలలో. అలాంటిది.. ఆ కారుపై ఆ పేరుతో నెంబరు ప్లేటు ఎలా వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారును తప్పకుండా ఫిబ్రవరి-మార్చి నెలలో పార్కు చేసి ఉంటారని భావిస్తున్నారు. దీని రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించగా.. ఈ కారు నెంబరును సెప్టెంబరు 2020 వరకు రిజిస్టర్ చేసి ఉన్నట్లు తెలిసింది. అయితే, దాని యజమాని వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.

లాక్‌డౌన్ విధించడం వల్ల విమానాశ్రయ సిబ్బందిలో ఒకరు కారును అక్కడే పార్కు చేసి వెళ్లిపోయి ఉంటాడని కొందరు అంటున్నారు. అయితే, ఇన్ని రోజులు ఆ కారుకు కవర్ వేసి ఉందని, ఇటీవల వీచిన ఈదురు గాలుల వల్ల కవర్ పైకి లేవడంతో కారు నెంబరు ప్లేటు కనిపించిందని మరొక ఉద్యోగి చెప్పాడు. ఈ పార్కింగులో విమానాశ్రయ సిబ్బంది 48 గంటలు వాహనాలు నిలిపేందుకు అనుమతి ఉంటుందని, పైలట్ ఎవరో ఇక్కడ వాహనాన్ని పార్క్ చేసి లాంక్ హాలిడేస్‌కు వెళ్లి ఉండవచ్చని, లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోవడం వల్ల కారు అక్కడే ఉండిపోయి ఉంటుందని మరికొందరు అంటున్నారు.
Reactions

Post a Comment

0 Comments