వ్యక్తిత్వ తరంగాలు 01

వ్యక్తిత్వ తరంగాలు 01

  1. ఇతరులను విమర్శించే ముందుగా నిన్ను నీవు తెలుసుకో .
  2.  నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు నిన్ను దండించి , ఆ దారి మళ్ళించి , సక్రమంగా నడిపించేవాడే నిజమైన మిత్రుడు . 
  3. చేట్టును వేరుపురుగు బయటకు కనపడకుండా ఎలా నాశనం చేస్తుందో , మనిషిని అసూయ కూడా లోలోపల అలాగే సర్వనాశనం చేస్తూ వస్తుంది .
  4. సంపన్నుడైన మూర్ఖుడు సమాజానికి ముప్పు , నిన్నటి రోజున పొరపాటును తలుచుకుంటూ ఈ రోజును రం చేసుకోకు .
  5. దయలేని దాయాదులు , ప్రేమలేని మిత్రులు ఉన్నా లేనట్లే.
  6. నీ సిరిసంపదలను చూసి దగ్గరికొచ్చే బంధువులు , నీ అంద చందాలను , ఆస్తిపాస్తులను చూసి పుట్టే ప్రేమ , కలకాలం నీతో నిలువవు . 
  7. అందరి సలహాలనూ ఆలకించు ఉత్తమమైన వాటిని స్వీకరించు , అత్యుత్తమమైన వాటిని ఆచరించు . 
  8. ఉలిదెబ్బలను తట్టుకొని రాయి శీలగా ఎలా మారుతుందో , అలాగే అనేక ఆటుపోట్లను తట్టుకున్నప్పుడే , మనిషి తన లక్ష్యాన్ని సాధిస్తాడు .

Post a Comment

0 Comments