స్పానిష్‌ ఫ్లూ.. పూర్తి చరిత్ర అప్పుడు స్పానిష్‌ ఫ్లూ.. వల్ల 100 కోట్లు మంది కన్నా ఎక్కువ చనిపోయారు ఇప్పుడు కారోన వల్ల ఎంత మంది?

1920లో స్పానిష్‌ ఫ్లూ..

కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే 1920లో స్పానిష్‌ ఫ్లూ వైరస్‌ వచ్చింది. ఈ వైరస్‌ పేరు చెబితేనే ఇప్పటికీ భయపడతారు. సృష్టిలోనే అతిపెద్ద విషాదం మిగిలి్చన భయంకర వ్యాధిగా స్పానిష్‌ ఫ్లూ మిగులుతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్‌గా ఇప్పటికీ దీనిని పరిగణిస్తారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా సుమారు కోటి మంది మృతి చెందారు. 
జీవితం మీద ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది...'' - మహాత్మా గాంధీ 1918లో గుజరాత్‌లోని తన ఆశ్రమంలో తనను కలిసిన ఒక సన్నిహితుడితో చెప్పిన మాట ఇది. అప్పుడు ఆయన ఒక ప్రాణాంతక ఫ్లూతో పోరాడుతున్నారు.

1918 నాటి స్పానిష్ ఫ్లూ ప్రపంచ జనాభాలో మూడో వంతు మందికి సోకిందని అంచనా


అప్పుడు గాంధీ వయసు 48 ఏళ్ళు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చి నాలుగేళ్లయింది. గుజరాత్‌లోని ఆయన ఆశ్రమాన్ని స్పానిష్ ఫ్లూ మహమ్మారి చుట్టుముట్టింది.

గాంధీకి కూడా అది సోకింది. ఆయన జీవితంలో అది ''సుదీర్ఘంగా సాగిన తొలి జబ్బు''. ఆయన ద్రవాహారానికి మాత్రమే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. ఆయన అనారోగ్యం గురించి తెలిసినపుడు ఒక స్థానిక వార్తాపత్రిక: ''గాంధీ జీవితం ఆయనకు చెందదు - అది భారతదేశానికి చెందుతుంది'' అని రాసింది.

ఆశ్రమం వెలుపల.. 1918 జూన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం నుంచి తిరిగివచ్చిన సైనికులతో పాటు బొంబాయి (ఇప్పుడు ముంబై) రేవుకు ఓడలో వచ్చిన ఆ ప్రాణాంతక ఫ్లూ భారతదేశాన్ని అతలాకుతలం చేసింది.

హెల్త్ ఇన్‌స్పెక్టర్ జె.ఎస్.టర్నర్ నివేదిక ప్రకారం.. ఆ మహమ్మారి ''రాత్రి పూట దొంగలా వచ్చింది. వేగంగా మోసపూరితంగా వ్యాపించింది''. ఈ వ్యాధి రెండోసారి సెప్టెంబర్‌లో దక్షిణ భారతదేశం మీద పంజా విసిరింది. తీరప్రాంతమంతా విస్తరించింది.

ఆ ఇన్‌ఫ్లుయెన్జా 1.7 కోట్ల నుంచి 1.8 కోట్ల మంది భారతీయులను బలితీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మొత్తం చనిపోయిన వారి సంఖ్య కన్నా ఇది అధికం. భారతప్రజల్లో ఆరు శాతం మంది చనిపోయారు.


రెండు కోట్ల మందికి జనాభా ఉన్న బొంబాయి...

భారతదేశంలో అత్యధిక జనాభా గల నగరం. ఆ నగరం ఉన్న మహారాష్ట్రలోనే దేశంలోకెల్లా అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.


1918 జూలై ఆరంభం నాటికి స్పానిష్ ఫ్లూ కారణంగా రోజుకు 230 మంది చనిపోతున్నారు. జూన్ చివరిలో రోజు వారీ మరణాల కన్నా దాదాపు మూడు రెట్లు పెరిగాయి.


''అధిక జ్వరం, వీపు నొప్పులు ప్రధాన లక్షణాలు. మూడు రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. బొంబాయిలో దాదాపు ప్రతి ఇంట్లో కొంతమంది జ్వరంతో మంచాన పడ్డారు'' అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో చెప్పింది.


కార్మికులు కార్యాలయాలు, కర్మాగారాలకు వెళ్లకుండా దూరంగా ఉన్నారు. భారతదేశంలో నివసించే యూరప్ వాసులకన్నా భారతీయులే అధికంగా ఈ వ్యాధి బారినపడ్డారు.


జనం బయటకు రావద్దని, ఇళ్లలోపలే ఉండాలని ఆ పత్రిక సూచించింది. ఈ వ్యాధికి ''ముఖ్యమైన పరిష్కారం.. మంచం మీద పడుకోవటం.. ఆందోళన చెందకుండా ఉండటం'' అని పేర్కొంది.

Post a Comment

0 Comments