quotations in telugu

Quotations in telugu


  1.  నువ్వు ఓడిపోతే అవహేళన చేసే వారుంటారు . నీ ఓటమిని గల కారణాలను విశ్లేషించి ముందడుగు వేయాలిగానీ , నిన్ను అవహేళన చేసిన వారి గురించి అస్సలు ఆలోచించకు .
  2. నువ్వు ఒక్కసారి భయపడితే ఈ ప్రపంచం ప్రతిసారీ నిన్ను భయపెడుతూనే ఉంటుంది . భయం వీడి నువ్వు ముందడుగు వేస్తే , ఆ భయమే నిన్ను చూసి భయపడుతుంది .
  3. అహంకారంతో జీవించకు , ఆత్మవిశ్వాసంతో జీవించు .
  4.  ఈ లోకంలో బ్రతికేవాళ్ళు కొందరు , బ్రతికించే వాళ్ళు ఇంకొందరు , బ్రతక నేర్చినవాళ్ళు మరికొందరు . నీతిలేని వారి మాటలు నీటి మీద రాతలు , నిజాయితీ లేని వారి పనులు ఎడారిలో వానలు .
  5. దీపం వెలుగు నివ్వాలన్నా , ధూపం వాసన నివ్వాలన్నా కావలసింది నిప్పు . మనిషి మంచి చేయాలన్నా , చెడు చేయాలన్నా కావలసింది మనసు . నిప్పును ఎలా జాగ్రత్తగా వాడతామో , మనసును కూడా అలాగే నియంత్రించుకోవాలి .
  6.  నువ్వు ఎవరికీ మంచి చేయకపోయినా పరవాలేదు . కానీ , చెడు మాత్రం చేయకు . 
  7. ఫలితాల గురించి బెంగపెట్టుకున్నవాడే , పని కష్టంగా ఉందని వంకలు పెడతాడు .

Post a Comment

0 Comments